Godavari

EAST & WEST GODAVARI

గోదావరి

ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు అంటే ఆర్థికంగా సుసంపన్న‌మైన భూత‌ల స్వ‌ర్గం.. ప‌చ్చ‌టి పైరులు.. అబ్బుర‌ప‌రిచే జ‌ల‌వ‌న‌రులు.. క‌ల్మ‌షం లేని వ్య‌క్తులు.. ఆయ్‌.. అనే గోదావ‌రి యాస‌తో కూడిన అప్యాయ‌త‌లు.. మ‌ర్యాద‌లు ఎంత‌టివారినైనా క‌ట్టిప‌డేస్తాయి. గోదారోళ్లు ఎక్క‌డ ఉంటే అక్క‌డ సంద‌డి క‌నిపిస్తుంటుంది. ఆర్థికంగా బ‌ల‌మైన ఉభ‌య‌గోదావ‌రి అంద‌రికీ అన్నం పెట్టే అన్న‌పూర్ణగా కీర్తింప‌బ‌డుతోంది. ఇదంతా పైకి క‌నిపించేది మాత్ర‌మే.. వెలుగులు వెనుక చీక‌టిని చూస్తే మ‌న‌సుల‌ను మెలిపెడుతోంది. అంకెల గ‌ణంకాల్లో అద్భుతాలు క‌నిపిస్తున్నా వాస్త‌వ రూపంలో మింగుడు ప‌డ‌ని వాస్త‌వాలు మన మ‌న‌సుల‌ను క‌దిలిస్తాయి. పొట్ట కూటి కోసం గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్లి వెట్టిచాకిరీ చేస్తున్న మ‌న‌వాళ్ల‌ని చూస్తుంటే బాధేస్తోంది. ఆక‌లి, అనారోగ్యం, పేద‌రికం గోదావ‌రి గ్రామాల్లో తిష్ట‌వేశాయి. వ‌ల‌స‌పోతున్న బ‌తుకులు క‌న్నీళ్లు తెప్పిస్తున్నాయి. తాగుడుకు బానిస‌లుగా మారిన భ‌ర్త‌లు చిరు వ‌య‌సులోనే ప‌ర‌లోకానికి వెళ్లిపోతుంటే భారంగా నెట్టుకొచ్చే బ‌తుకుల‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్న అబ‌ల‌లు స‌జీవ సాక్ష్యంగా క‌నిపిస్తున్నారు. మ‌ద్యం ర‌క్క‌సి దాహానికి బ‌లైన మ‌ర‌క‌లు ఎక్క‌డ‌కు వెళ్లినా క‌నిపిస్తుంటాయి. పేద‌రికం కార‌ణంగా ఆగిపోయిన చ‌దువులు.. వెంటాడుతున్న నిరుద్యోగంతో యువ‌కులు ల‌క్ష్యాల‌కు దూర‌మై గ‌తి త‌ప్పుతున్నారు. రెండు కిడ్నీలు పాడ‌య్యేవ‌ర‌కు కిడ్నీలు పాడ‌య్యాయ‌ని.. స్పృహ త‌ప్పి ప‌డిపోయే వ‌ర‌కు షుగ‌ర్ వ్యాధి ఉంద‌ని తెలియ‌ని ప‌రిస్థితుల్లో అనేక మంది అర్ధంత‌రంగా త‌నువు చాలిస్తున్నారు. ఆరుగాలం శ్ర‌మ‌నే న‌మ్ముకుని క‌ష్టించే రైత‌న్న‌లు దుక్కి దున్న‌డం ద‌గ్గ‌ర నుంచి పంట చేతికొచ్చే వ‌రుకు అడుగ‌డుగునా మోస‌పోతున్నాడు. పండిన పంట‌ను అమ్ముకోవాలంటే చివ‌రికి వ్యాపారి, ద‌ళారులు చెప్పిందే వేద‌మ‌వుతుంది. వ్య‌వ‌సాయానికి ఆధునిక సాంకేతిక‌త ప‌రిజ్ఞానం.. వాణిజ్య పంట‌లు సాగు అనేవి ఇంకా అంద‌నంత దూరంలోనే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్ల‌లు, విద్యార్థులు, యువ‌త‌, మ‌హిళ‌లు, రైతులు ప్ర‌తీ ఒక్క‌రూ స‌రైన అవ‌గాహ‌న, చైత‌న్యం లేక వెనుక‌బ‌డిపోతున్నారు. వీరంద‌రిని ఇలాగే వ‌దిలేద్దామా? చుట్టూ ఉన్న చీక‌టిని చూసి అలాగే తిట్టుకుందామా? ఇంకా ఎన్నాళ్లూ? అనే ప్ర‌శ్న నుంచి గోదావ‌రి ఎన్ఆర్ ఐ విభాగం ఆవిర్భ‌వించింది. గోదార‌మ్మ బిడ్డ‌లుగా మాతృభూమి రుణం తీర్చుకొనేందుకు అమెరికాలో ఉన్న ఉభ‌య‌గోదావ‌రి జిల్లా వాసులు అంతా క‌లిసి గోదావ‌రి ఎన్ ఆర్ ఐ విభాగం ఏర్పాటు చేశాం. విద్యా, ఆరోగ్యం, ఉపాధి, మ‌హిళా అభ్యుద‌యం కోసం నిరంత‌రం మేం శ్ర‌మిస్తాం. గోదావ‌రి జిల్లాల నుంచి అమెరికాకు వ‌చ్చే ఎంఎస్ విద్యార్థుల‌కు వ‌డ్డీలేని విద్యారుణాలు పొందేలా అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద‌గ్గ‌ర నుంచి వ్య‌వసాయంలో ఆధునిక పరిజ్ఞానం ఉప‌యోగించి రైతుల‌కు అధిక దిగుబడులు పొందేలా దీర్ఘ‌కాలికంగా కార్య‌క్రమాలు రూపొందిస్తున్నాం. ఏడో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు మ‌ధ్య‌లో చ‌దువుల‌కు దూర‌మైన విద్యార్థుల‌ను గుర్తించి వారిని తిరిగి పాఠశాల‌ల్లో చేర్పించేందుకు అత్య‌వ‌స‌ర ప్ర‌ణాళిక రూపొందించాం. వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు చెందిన ప‌దో త‌ర‌గతితో మంచి ఉత్తీర్ణ‌త సాధించి ప్ర‌తిభ క‌న‌భ‌రిచిన విద్యార్థుల‌ను క‌ళాశాల‌లు చేర్చుకోక‌పోతే వారికి అండ‌గా నిల‌బ‌డ‌తాం. అమెరికాలో ఉన్న ఎంఎస్ విద్యార్థుల‌కు సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్, ఉద్యోగ అవ‌కాశాలు పొంద‌డానికి స‌హాయ చేస్తాం. ఎన్ ఆర్ ఐ పిల్ల‌ల‌కు విద్యావ‌కాశాలు, భవిష్య‌త్తును తీర్చుదిద్దుకునేలా ఆత్మ‌విశ్వాసం క‌ల్పించి విశ్వ‌విద్యాల‌యాల్లో ప్ర‌వేశాలు పొందేందుకు అవ‌స‌ర‌మైన కౌన్సెలింగ్‌, విద్యా, ఉద్యోగ జీవితాల్లో స్థిర‌ప‌డే విధంగా ప్ర‌ణాళిక అమ‌లు చేయ‌బోతున్నాం. గోదార‌మ్మ బిడ్డ‌లుగా మేమంతా మాతృభూమి రుణం తీర్చుకొనేందుకు ఎదురు చూస్తున్నాం. ఇందుకు క‌లిసొచ్చే ఉభ‌య‌గోదావ‌రి జిల్లా వాసులు ప్ర‌పంచంలో ఎక్క‌డ ఉన్నా గోదావ‌రి ఎన్ ఆర్ ఐ విభాగంతో జ‌త క‌ల‌వండి.. ఉప్పొంగే గోదారిలా అనేక‌మంది జీవితాల్లో వెలుగు నింపేందుకు మీ వంతు స‌హ‌కారం అందించండి.

ఉభ‌యగోదావ‌రి వాసుల ప్రేమ‌ని కాంక్షిస్తూ.. మీ
గోదావ‌రి ఎన్ఆర్ఐ విభాగం

East Godavari

East Godavari District which is the largest and the most populous district in the state of Andhra Pradesh, was successively ruled by Mauryas, Sathavahanas, Vishnu Kundins, Eastern Chalukyas, Cholas, Kaktiyas, Musunuri Chieftians, Kondaveeti Reddy Kings, Gajapathis, Kutubshahis and then by the British. It was under the Raj, on April 15, 1925, East Godavari District was formed as per G.O.No.502. East Godavari is the richest district of the state, in terms of GDP, is both the cultural and tourist hub of the state.

papikondalu
banner-2

West Godavari

AS ITS NAME INDICATES, IS A PART OF THE GODAVARI DELTA IN ANDHRA PRADESH. IT LIES BETWEEN 16O 15′-17O30′ NORTHERN LATITUDES AND 80O55′ AND 81O55′ EASTERN LONGITUDES. IT IS SURROUNDED BY KHAMMAM DISTRICT ON THE NORTH, KRISHNA DISTRICT AND THE BAY OF BENGAL ON THE SOUTH AND ON THE EAST BY RIVER GODAVARI AND KRISHNA DISTRICT ON THE WEST.

As they write and revise the standards, ccsso and nga officials https://get-thesis.com have said they are being guided by a search for the best available evidence of what works in math and language arts, rather than by unsupported opinion.